20 ఏళ్లుగా వ్యవసాయ భూమి కేటాయించలేదా? | Telangana High Court expresses surprise in the case of a woman displaced by the Sriramsagar Project | Sakshi
Sakshi News home page

20 ఏళ్లుగా వ్యవసాయ భూమి కేటాయించలేదా?

Sep 27 2026 4:48 AM | Updated on Sep 27 2026 4:48 AM

Telangana High Court expresses surprise in the case of a woman displaced by the Sriramsagar Project

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు భూ నిర్వాసితురాలి కేసులో హైకోర్టు ఆశ్చర్యం 

2 వారాల్లో కేటాయించి అప్పగించాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) నిర్మాణంలో భూ నిర్వాసితురాలికి 20 ఏళ్లుగా వ్యవసాయ భూమి కేటాయించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ వ్యవసాయ భూమిని కేటాయించి, ఆమెకు స్వాధీనం చేసినట్లు తదుపరి విచారణలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది. అయితే, రూ.10 లక్షల పరిహారాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ఆ తేదీన పరిశీలిస్తామని చెప్పింది. 

ఏళ్లు గడుస్తున్నా హద్దులు నిర్ణయించి తనకు భూమి అప్పగించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన చిన్నమ్మ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ వివరాల మేరకు.. భూమి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ముంపునకు గురైంది. పునరావాస, పునఃనిర్మాణ పథకం కింద ప్రత్యామ్నాయ వ్యవసాయ భూమి ఇవ్వాల్సి ఉండగా, 2006లో ఆమెకు ఒబ్లాపూర్‌–2లోని 2.01 ఎకరాల భూమికి డీ–1 పట్టా జారీ చేశారు. అయితే సరిహద్దులు నిర్ణయించి భూమిని ఆమెకు భౌతికంగా అప్పగించలేదు.

తనకు కేటాయించిన భూమిలో ఇతరులు సాగు చేస్తున్నారని ఆమె అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా పరిష్కారం కాకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. నాలుగు నెలల్లో సాగుభూమి కేటాయించి స్వాధీనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే, ఆమె ఇప్పటివరకు రెండు ఎకరాల సాగుపై నష్టపోయిన రూ.10 లక్షలను, కోర్టు ఖర్చులను చెల్లించాలని స్పష్టం చేశారు.  

నివేదిక సమర్పించండి.. 
సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం అప్పీల్‌ వేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవా ది వాదనలు వినిపిస్తూ.. ప్రత్యామ్నాయ భూమి కేటాయించలేకపోవడానికి మూడో వ్యక్తి భూ మిపై ఉండటమే కారణమన్నారు. కేటాయింపు ప్రక్రి య కొనసాగుతోందని, రెండు వారాల్లో పూర్తి చేస్తా మని తెలిపా రు. అయితే, రూ.10 లక్షల పరిహారం ఆ దేశాన్ని తొలగించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రెండు వారాల సమయం ఇచ్చింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement