హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు

Telangana: Heavy Rains Hits Again Hyderabad and Few Districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మళ్లీ వరుణుడి ప్రతాపం మొదలైంది. గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మొదలైన వాన సుమారు గంటపాటు దంచికొట్టింది. ఆల్వాల్‌, బోరబండ, యూసఫ్‌గూడ, మైత్రినవం, నిజాంపేట, కూకట్‌పల్లి, బోయినపల్లి, మారేడుపల్లి, బేగంపేట, చిలకలగూడ.. ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మళ్లీ సాయంత్రం సమయంలో భారీ వర్షం పడింది.  ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోనూ ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏదొక సమయంలో నగరంలో వర్షం కురుసిన నేపథ్యంలో చాలాచోట్ల రోడ‍్లన్నీ జలమయమయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. చాలాచోట్ల నిలిచిపోయిన నీటిని తరలిస్తున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. 

గణేషుడి విగ్రహాల నిమజ్జనం దరిమిలా.. వర్షాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందునా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top