తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. ప్రభుత్వం హైఅలర్ట్‌, అధికారులకు ఆదేశాలు

Telangana: Heavy Rains Forecast Next Three Days GHMC Emergency Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గురువారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేటి సాయంత్రం వానలు కురిశాయి. అయితే, మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు వర్షాలపై జీహెచ్‌ఎంసీ అత్యవసరంగా సమావేశమైంది. జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది.

కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్లు
040-21111111, 040-29555500

వాగులో ప్రాణాలు అరచేతపట్టుకుని
కామారెడ్డి జిల్లాలోని శెట్‌పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురిని స్థానికులు,పోలీసుల సహకారంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు. చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వరద ఉధృతి ఎక్కువ కావడంతో చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చెట్టుపైనే ఉండి సాయం కోసం ఎదురుచూశారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఘటనస్థలానికి పంపించారు. తాడు సాయంతో వారు బాధితులను ఒడ్డుకు చేర్చారు. దీంతో కొన్ని గంటల ఉత్కంఠకు తెరపడింది. స్థానికులు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఒడ్డుకు చేరిన అనంతరం బాధితులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top