హంద్రీనీవా, గాలేరునగరి విస్తరణను అడ్డుకోండి

Telangana Govt Letter To Krishna River Management Board - Sakshi

కృష్ణానదీ యాజమాన్యబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ 

బేసిన్‌ దాటి కృష్ణాజలాలు తరలిస్తున్నారని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణాజలాలను పరీవాహక ప్రాంతం బయటకు తరలించేలా హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రా­జెక్టుల విస్తరణను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని తెలంగాణ ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం కృష్ణా­జలాలపై ఎలాంటి ప్రాజెక్టు చేపట్టాలన్నా కృష్ణా­నదీ యాజమాన్యబోర్డు(కేఆర్‌ఎంబీ), అపె­క్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీ­ధర్‌రావు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ మహేంద్రప్రతాప్‌ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఆయా ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశా­రు. కేంద్ర అటవీ, పర్యావరణ మార్పుల మంత్రి­త్వశాఖ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి పర్యావరణ మదిం­­ç­³# అథారిటీలకు కూడా విడివిడిగా రాసిన లేఖలో­్లనూ విస్తరణ ప్రాజెక్టులకు ఇచ్చిన పర్యావ­రణ అనుమతి(ఈసీ) అమలు కాకుండా నిలిపివే­యాలని కోరారు.

ఈ విస్తరణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని పలుమార్లు కృష్ణాబోర్డుకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు­చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020 ఆగస్టు 26న గాలేరునగరి నుంచి హంద్రీనీవాకు నీటితరలింపు నిమిత్తం రూ.5,036 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించిందని వివరించారు. గాలేరునగరి కాలువ 56 కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్న చెరువులకు 15.53 టీఎంసీల కృష్ణాజలా­లను తరలించేందుకు ప్రయత్ని­స్తున్నారని ఆరోపించారు.

ఆ వివరాలివ్వండి ప్లీజ్‌
శ్రీశైలం–నాగార్జునసాగర్‌ రూల్‌కర్వ్‌ ముసాయిదా రూపొందించడానికి ప్రమాణాలేంటీ, ఏ ప్రాతి­పదికన రూల్‌కర్వ్‌ సిద్ధం చేశారో ఆధారాల్విండంటూ మరో లేఖను ఈఎన్‌సీ మురళీధర్‌రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాశారు. దీనిపై కేఆర్‌ఎంబీ స్పందిస్తూ ‘కేఆర్‌ఎంబీకి సహకరించండి.  తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వి వాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించడానికే సమావేశం ఏర్పాటు చేశాం’అంటూ ప్రత్యుత్తరం ఇచ్చింది.

ఆ లేఖపై స్పందిస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ స్టేక్‌ హోల్డర్‌ కావడం వల్ల, ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నదని జల వనరుల సంఘం, ప్రణాళిక సంఘం శ్రీశైలం ప్రాజెక్టును ఆమోదించిన పత్రాలు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు మురళీధర్‌రావు కోరారు. 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం, శ్రీశైలం కుడి కాల్వతోపాటు పోతిరెడ్డిపాడుకు కేంద్రం అను మ తి జారీచేసిన పత్రాలు ఇవ్వాలని కోరు తున్నా మ న్నారు. రూల్‌కర్వ్‌ ఎలానిర్ణయించారో తెలుసు­కోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top