Telangana: సూపర్‌ స్ప్రెడర్లకు 28 నుంచి టీకాలు

Telangana Govt Focus On Super Spreader Of Coronavirus - Sakshi

హైదరాబాద్‌లో మొదట ఆటోడ్రైవర్లతో షురూ

సీఎస్‌ సోమేశ్‌తో మంత్రి హరీశ్‌రావు సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: వృత్తి, వ్యాపారాల రీత్యా నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్న వారిని సూపర్‌స్ప్రెడర్లుగా పరిగణిస్తూ వారందరికీ టీకాలు వేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలు తీరుపై సోమవారం సమీక్ష సందర్భంగా సూపర్‌ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్‌ అంశాన్ని పరిశీలించాలని హరీశ్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యం లో మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో హరీశ్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమై సూపర్‌ స్ప్రెడర్ల గుర్తింపు, ఇతర ఏర్పాట్లపై చర్చించారు.

ప్రస్తుతమున్న వ్యాక్సిన్‌ నిల్వల ఆధారంగా.. ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఆటోడ్రైవర్లతో వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్‌స్ప్రె డర్స్‌ దాదాపు 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. వీరిలో 18 ఏళ్లు నిండిన వారం దరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలని నిర్ణయిం చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉన్నా నిత్యావసరాల కోసం 4 గంటలపాటు వెసులుబాటు కల్పించారు. ఈ సమయంలో ప్రజానీకం విపరీతంగా చేపలు, మాంసం, కిరాణా దుకాణాలకు వెళ్తుండటంతో కరోనా సోకుతోంది. అక్కడ పనిచేసే సిబ్బంది, వ్యాపారుల్లో ఏమాత్రం లక్షణాలున్నా.. అది వచ్చే ప్రజలకు సులభంగా అంటుకునే అవకాశం ఉంది. దీంతో ముందుగా ఈ సూపర్‌ స్ప్రెడర్స్‌కు టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సమావే శంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్య దర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్‌ ఎన్‌.సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. డీలర్లు, గుమాస్తాలు, పెట్రోలి యం, ఎల్పీజీ డీలర్లు, సిబ్బందికి కోవిడ్‌ టీకాలు వేసేందుకు ఈ నెల 28 నుంచి 31 వరకు స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు పౌరసరఫ రాల శాఖ కమిషనర్‌ జిల్లా కలెక్టర్లకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగిం చాలన్నారు. ఇందుకు ముందుగానే లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. 

సూపర్‌ స్ప్రెడర్స్‌ అంటే..
వృత్తి, వ్యాపారాల రీత్యా ప్రజల మధ్య ఉంటూ కోవిడ్‌ వ్యాప్తికి కార ణమవుతారని భావిస్తున్న వారిని సూపర్‌ స్ప్రెడర్లుగా పరిగణిస్తారు.

సూపర్‌ స్ప్రెడర్స్‌ వీరే...
ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిబ్బంది, రేషన్‌ డీలర్లు, పెట్రోల్‌ పంపుల సిబ్బంది, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు, పూల మార్కెట్లు, కిరాణా షాపులు, మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్ల వ్యాపారులు, సెలూన్లలో పనిచేసే సిబ్బంది. 

30,00,000
రాష్ట్రవ్యాప్తంగా ఈ సూపర్‌ స్ప్రెడర్స్‌ దాదాపు 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వీరందరికీ ఉచితంగానే టీకాలు వేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-05-2021
May 26, 2021, 10:43 IST
సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో మళ్లీ 2లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర...
26-05-2021
May 26, 2021, 09:53 IST
కరోనాతో అల్లాడిపోతున్న జనాల్లో కొత్త ఆశలను రేకెత్తించింది ఆనందయ్య మందు. డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసినా కట్టడి కాని వైరస్‌...
26-05-2021
May 26, 2021, 09:24 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ మరణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు 577 మంది ఉన్నట్లు రాష్ట్రాలు వెల్లడించాయని కేంద్ర...
26-05-2021
May 26, 2021, 09:00 IST
ఈ దర్శకుడికి కరోనా సోకడంతో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచాడు.
26-05-2021
May 26, 2021, 08:54 IST
కోల్‌కతా: గత వారంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టచార్జీ(77) మంగళవారం ఆస్పత్రిలో చేరారు....
26-05-2021
May 26, 2021, 08:30 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని సందర్శించారు....
26-05-2021
May 26, 2021, 08:27 IST
బనశంకరి: కరోనా మహమ్మారి గర్భంలోని బిడ్డను– తల్లిని వేరు చేసింది. వైద్యుల చొరవతో కడుపులోని బిడ్డ ప్రాణాలతో బయటపడింది కానీ,...
26-05-2021
May 26, 2021, 04:12 IST
ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతం మందికిపైగా కరోనా పలకరించి వెళ్లిపోయింది!
26-05-2021
May 26, 2021, 03:27 IST
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి అందరినీ బెంబేలెత్తిస్తోంది. దీంతో అందరూ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు రకరకాల మందులూ, ఆహారం...
26-05-2021
May 26, 2021, 02:13 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ తర్వాతి వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందనే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని కోవిడ్‌–19 వర్కింగ్‌ గ్రూప్‌...
25-05-2021
May 25, 2021, 19:29 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదిరోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మంగళ వారం (నేటి) నుంచే పునఃప్రారంభమవుతోంది. ఈ మేరకు...
25-05-2021
May 25, 2021, 17:44 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 72,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,06,210...
25-05-2021
May 25, 2021, 12:26 IST
ఒకవేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మృత్యువాత పడితే, పూర్తి స్థాయి జీతంతో పాటు సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్‌...
25-05-2021
May 25, 2021, 10:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. అయితే కరోనా మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా...
25-05-2021
May 25, 2021, 10:19 IST
ఆర్డినరీ హీరోలు ఎక్స్‌ట్రార్డినరీగా పనిచేస్తున్న వారి కథనాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. వాళ్లు చేస్తున్న కార్యక్రమాలు నాలో కొత్త ఆశను...
25-05-2021
May 25, 2021, 10:13 IST
న్యూఢిల్లీ: రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌), భారత ఔషధ దిగ్గజం పనాసియా బయోటెక్‌లు స్పుత్నిక్‌–వి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీని...
25-05-2021
May 25, 2021, 09:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద కోవిడ్‌ టూల్‌కిట్‌ కేసులో ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ ట్విట్టర్‌ యాజమాన్యానికి సోమవారం నోటీసు జారీ...
25-05-2021
May 25, 2021, 07:55 IST
చండీగఢ్‌: కరోనా వైరస్‌ బారిన పడ్డ భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేర్పించామని...
25-05-2021
May 25, 2021, 05:31 IST
ప్రైవేట్‌ వైద్యులు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ బాటపట్టారు. కోవిడ్, ఇతర రుగ్మతల బారిన పడిన వారికి ఫోన్, వాట్సప్‌ ద్వారా చికిత్సలను...
25-05-2021
May 25, 2021, 04:57 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏటా 8...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top