కొత్త కొలువుల్లో ఉద్యోగులు

Telangana Government Statement Over Government Employees Allocation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ విధానంలో భాగంగా చేసిన ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ (2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం) శుక్రవారంతో పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని కేడర్ల కేటాయింపుల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆదేశాలు అందుకున్న వారిలో ఎక్కువమంది విధుల్లో చేరినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

ముఖ్యంగా 22,418 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలిగితే ఇప్పటివరకు 21,800 మంది కొత్త ప్రాంతాల్లో జాయిన్‌ అయ్యారు. మిగతా వారు శనివారం చేరే వీలుంది. కాగా 13,760 మంది జిల్లా కేడర్‌ ఉద్యోగులు కొత్త చోట్ల చేరారు. జోనల్, మల్టీ జోనల్‌ కేటాయింపుల ప్రక్రియ కూడా పూర్తయిందని, శనివారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ విభజన ద్వారా స్థానిక యువతకు 95 శాతం మేర ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎంవో పేర్కొంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top