విద్య, వైద్యంలో అద్భుతాలే లక్ష్యం | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యంలో అద్భుతాలే లక్ష్యం

Published Sat, Jun 11 2022 12:38 AM

Telangana Gives Top Priority For Education Health Sectors: Minister KTR - Sakshi

సిరిసిల్ల/మెట్‌పల్లి(కోరుట్ల): విద్య, వైద్యరంగాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మూడేళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో చల్మెడ జానకీదేవి పేరుతో రూ.2కోట్లతో నిర్మించిన స్కూల్‌ భవనాన్ని శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి ప్రారంభించారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు.. మన బడి’లో రూ.7,300 కోట్లతో 2,600 స్కూళ్లలో 12 రకాల వసతులు కల్పించి ఇంగ్లిష్‌ మీడియంగా మార్చుతున్నామని వివరించారు. ఇటీ వల అమెరికా వెళ్లినప్పుడు అనేక మంది ప్రవా సులు సొంతూళ్లలో తమ పూర్వీకుల పేరిట స్కూల్‌ భవనాలు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రన్నారు.

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ ఆర్‌)లో భాగంగా అనేక కార్పొరేట్‌ సంస్థలు పేద లకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్ల డించారు. కాగా, వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఇథనాల్‌ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు డెక్కన్‌ అగ్రి రిసోర్సెస్‌ కంపెనీతో ఎంవోయూ పూర్తిచేశారు. 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయం
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయమని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో కలసి పాల్గొన్నా రు. కాంగ్రెస్‌కు కుల, బీజేపీకి మత రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధిపై వాటికి చిత్తశుద్ధి లేదని కేటీఆర్‌ విమర్శించారు.

బీజేపీ చిల్లర మాటలతో గల్ఫ్‌ దేశాల్లోని లక్షలాది మంది భారతీయుల జీవి తాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, మెట్లచి ట్టాపూర్‌లో రూ.160 కోట్ల పెట్టుబడితో ధాత్రి, రూ.1,060 కోట్ల పెట్టుబడితో భువి బయో సంస్థలు ఏర్పాటు చేసే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోరుట్ల లో వీఫై ఐటీ సంస్థ ఏర్పాటు చేసే కాల్‌సెంటర్‌ ఒప్పందపత్రాలను యజమానులకు అందజేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement