న్యూ ఇయర్ కిక్.. ఒక్కరోజే రూ.215 కోట్లు తాగేశారు.. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం..

Telangana Excise Department Rs 215 Crore Income December 31st - Sakshi

హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ 31న ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చింది.  ఒక్కరోజే రూ.215 కోట్ల 74 లక్షలు ఆర్జించింది. మద్యం అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా ఇంత మొత్తం వచ్చింది.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 డిపోల నుండి జరిగిన రిటైల్ అమ్మకాలు వివరాలు (సుమారుగా)...

  • 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు 
  • లక్షా 28వేల 455 కేసుల బీర్లు

హైదరాబాద్ 1 డిపో 

  • 15 వేల 251  లిక్కర్ కేసులు 
  • 4వేల 141 కేసుల బీర్లు
  • 16 కోట్ల 90 లక్షలు ఆదాయం

హైదరాబాద్ 2 డిపో 

  • 18 వేల 907 లిక్కర్ కేసులు 
  • 7వేల 833 బీర్ కేసులు
  • 20 కోట్ల 78 లక్షల ఆదాయం
    మొత్తం హైదరాబాద్ రెండు డిపోల్లో వచ్చిన ఆదాయం రూ.37 కోట్ల 68 లక్షలు.

చదవండి: మందుబాబులకు షాక్.. 5,819 డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top