సెలవులు ముగియడంతో తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు..

Telangana Educational Institutions Reopen After Dussehra Holidays - Sakshi

సెలవులు ముగియడంతో పాఠశాలల బాటలో విద్యార్థులు, టీచర్లు.. 

పూర్తవని పార్ట్‌–1 సిలబస్‌.. పార్ట్‌–2 బోధనపై సందేహాలు

సాక్షి, హైదరాబాద్‌: దసరా సెలవుల తర్వాత విద్యా సంస్థలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోబోతున్నాయి. రెండు వారాల తర్వాత స్కూళ్లు, కాలేజీలు మళ్లీ సందడిగా మారనున్నాయి. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 9 వరకూ ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చారు. ఆ తర్వా త కొద్ది రోజులకు కాలేజీలకు సెలవులి చ్చారు. సెలవులు రావడంతో విద్యార్థులంతా సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.

ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు.. అన్ని ఖాళీ అయ్యాయి. ఉపాధ్యాయులు కూడా తమ ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. విద్యా సంస్థల పునః ప్రారంభంతో వీళ్లంతా తిరిగి తమ గూటికి చేరుకుంటున్నారు. దసరా సెలవుల తర్వాత జరిగే బోధన స్కూల్‌ విద్యార్థులకు కీలకమైంది. ఎఫ్‌ఏ–2 పరీక్షలు జరిగినా, పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన సిలబస్‌ మాత్రం పూర్తవ్వలేదు.

ఈ ఏడాది ఇంగ్లిష్‌ మీడియంలో బోధన మొదలు పెట్టారు. దీంతో ద్విభాష పుస్తకాలు ముద్రించాల్సి వచ్చింది. పుస్త కాల బరువు పెరగకుండా వాటిని రెండు భాగా లుగా చేశారు. ఈ కారణంగా ముద్రణ ఆలస్యమైంది. కొన్నిచోట్ల సెప్టెంబర్‌ మొదటి వారం వరకూ పార్ట్‌–1 పుస్తకాలు అందలేదు. దీనికి తోడు కరోనా కారణంగా నష్టపోయిన అభ్యసనను తిరిగి దారి లోకి తెచ్చేందుకు బ్రిడ్జ్‌ కోర్సులు, తొలిమెట్టు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

ఇవన్నీ సిలబస్‌ ఆలస్యమవడానికి కారణమయ్యాయి. వాస్తవానికి పార్ట్‌–1 పుస్తకాల్లోని సిలబస్‌ దసరా సెలవుల కన్నా ముందే పూర్తవ్వాలి. ఇది సాధ్యం కాకపోవడంతో తిరిగి పార్ట్‌–1లోని పాఠాలు చెప్పాల్సి ఉంటుందని టీచర్లు అంటున్నారు. ఇది పూర్తయి, పార్ట్‌–2 ఎప్పు డు మొదలు పెడతారనేదానిపై ఉపాధ్యాయ వర్గా లు స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే, పదోన్నతులు, బదిలీల డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top