పల్లెకు పట్టాభిషేకం

Telangana Budget 2023: 31426 Crores To Panchayati Raj And Rural Development Dept - Sakshi

బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లతో అగ్రతాంబూలం

గతేడాది రూ.29,586 కోట్ల నుంచి పెరిగిన కేటాయింపులు

గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు 

గ్రామీణరోడ్ల మెయింటెనెన్స్‌కు రూ.2 వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌లో పల్లెకు పట్టాభిషేకం చేశారు. అత్యధిక కేటాయింపులు చేసి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అగ్రతాంబూలం ఇచ్చారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌లో పీఆర్‌శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.29.586 కోట్ల కేటా యింపుల కంటే రూ.1,840 కోట్లు అధికం. ఐతే పీఆర్‌ శాఖతోపాటు మిషన్‌ భగీరథకు ఇచ్చిన రూ. 600 కోట్లు కూడా కలిపితే ఉమ్మడిగా (పీఆర్, ఆర్‌డీ, మిషన్‌భగీరథ శాఖకు కలిపి) రూ.32,026 కోట్లు కేటాయించినట్టు అవుతుంది.

వివిధ పథకాలు, కార్యక్రమాలకు బడ్జెట్‌ కేటాయింపులు కోరుతూ ఈ శాఖ ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ చాలామటుకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. కొత్తగా వేసే గ్రామీణ రోడ్లతోపాటు గతంలో వేసిన రోడ్ల నిర్వహణకు కలిపి రూ.2,587 కోట్లు, మిషన్‌ భగీరథ మెయింటెనెన్స్, మిషన్‌భగీ రథ ఇతర ఖర్చుల కోసం రూ.1,600 కోట్లు, జూని యర్‌ పంచాయతీ సెక్రెటరీల సర్వీసుల క్రమబద్ధీక రణ, దానికి తగ్గట్టుగా వేతనాల పెంపు నిమిత్తం రూ.315 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.849 కోట్లు, గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగుల పేస్కేళ్ల సవరణ నిమిత్తం కేటాయింపులు చేశారు.

కాగా, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు పైనాన్స్‌ కమిషన్‌ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతిని ధులు ఫైనాన్స్‌ ట్రెజరీల ఆమోదం కోసం వేచిచూడ కుండా స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top