గంట ముందే కేంద్రానికి రావాలి  | Telangana: All Set For Intermediate First Year Exams From October 25 | Sakshi
Sakshi News home page

గంట ముందే కేంద్రానికి రావాలి 

Oct 24 2021 2:27 AM | Updated on Oct 24 2021 7:59 AM

Telangana: All Set For Intermediate First Year Exams From October 25 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేపటి నుంచి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. పరీక్షల మూల్యాంకనం నవంబర్‌ మొదటి వారంలో మొదలువుతుందని, వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. బోర్డు జాయింట్‌ సెక్రటరీలు శ్రీనివాసరావు, నాయక్, ఓఎస్‌డీ సుశీల్‌తో కలసి జలీల్‌ శుక్రవారం మీడియాకు పరీక్షల వివరాలు తెలియజేశారు. ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కోవిడ్‌ కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా ప్రమోట్‌ అయ్యారని గుర్తు చేశారు.

వరుసగా రెండో ఏడాది పరీక్షలు నిర్వహించలేకపోతే వారి భవిష్యత్‌కు ఇబ్బంది ఉంటుందనే ఫస్టియర్‌ పరీక్షలు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 శాతం సిలబస్‌లోంచే ప్రశ్నాపత్రం రూపొందించామని, మునుపెన్నడూ లేని విధంగా 40 శాతం ఐచ్చిక ప్రశ్నలిస్తున్నామని తెలిపారు. తాము విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తే పరీక్షల్లో విజయం సాధించడం తేలికేనని జలీల్‌ చెప్పారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన 25 వేల మంది ఇన్విజిలేటర్లను గుర్తించామని వెల్లడించారు.

ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాత అస్వస్థతగా ఉన్న విద్యార్థులను ఇందులో ఉంచుతామని చెప్పారు. పరీక్ష రాయగలిగితే ఐసోలేషన్‌లోనే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రిన్సిపాల్‌ సంతకం లేకుండానే డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లతో పరీక్షకు వెళ్లవచ్చన్నారు.

ఆయన చెప్పిన ముఖ్యాంశాలు... 
పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు, వి ద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందు కు ప్రతీ జిల్లాలోనూ కలెక్టర్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్పీ, డీఐఈవో, సీనియర్‌ ప్రిన్సిపల్, జేఎల్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు.  

విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీతో సమన్వయం చేసుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మెడికల్, విద్యుత్, పోస్టల్‌ సిబ్బంది ప్రత్యేక సేవలందిస్తారు. పరీక్ష కేంద్రాలు, ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.   

హాల్‌టికెట్లలో తప్పులుంటే నోడల్‌ అధికారిని, ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సాయం పొందొచ్చు. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రానికి అనుమతించరు. 8.45 గంటలకు ఓఎంఆర్‌ అందజేస్తారు. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు.  

కోవిడ్‌ జాగ్రత్తలు 
పరీక్ష విధుల్లో పాల్గొనే ఇన్విజిలేట ర్లు, అధికారులు, చీఫ్‌ సూపరింటెం డెంట్‌ సహా అందరినీ వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారినే ఎంపిక చేశారు. పరీక్ష కేంద్రాన్ని శానిటైజేషన్‌ చేస్తారు. ప్రతీ విద్యార్థి మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్‌లు తెచ్చుకోని వారికి పరీక్ష కేంద్రాల్లో అందజేస్తారు. అంతేతప్ప ఆ కారణంతో పరీక్ష రాసేందుకు నిరాకరించరు.  

పరీక్షలు జరిగే వరకూ కేంద్రంలో స్టా ఫ్‌ నర్సు ఉంటారు. ఒక్కో పరీక్ష కేం ద్రంలో 250కి మించి విద్యార్థులు లే కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక దూరాన్ని దృష్టిలో ఉం చుకుని బెంచ్‌కు ఒకరు లేదా ఇద్దరిని కూర్చోబెడతారు. విద్యార్థులు 50 ఎంఎల్‌ శానిటైజర్లు తెచ్చుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement