సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు మంగళవారం ప్రకటించింది. ఒక్కో ఎగ్జామ్‌కు మూడు రోజుల గ్యాప్ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.


