సీఎం కేసీఆర్‌ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం

Published Wed, Nov 8 2023 2:55 PM

Technical Fault In Cm Kcr Helicopter In Sirpur - Sakshi

కొమరంభీం జిల్లా: కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌కు సాంకేతిక లోపం తెలెత్తింది. సిర్పూర్‌లో హెలికాఫ్టర్‌ టేకాఫ్‌ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ చాపర్‌ను నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం ఆసిఫాబాద్‌ బయలుదేరారు.

సోమవారం కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం కేసీఆర్‌కు ప్రమాదం తృటిలో తప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్ బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు.

కాగా, సీఎం కేసీఆర్‌ నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. సిర్పూర్‌ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఆసిఫాబాద్‌, బెల్లంపల్లిలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు.

Advertisement
Advertisement