‘వాట్సాప్‌’.. అంతా ఓకేనా?

Techies Organization Corona Treatment - Sakshi

ఐటీ ఉద్యోగుల అండగా టీఎఫ్‌ఎంసీ

కరోనా సాయం కోసం ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌

కొందరు ఐటీ ఉద్యోగులు కలిసి ఏర్పాటు

వైరస్‌ సోకిన వారికి వీలైనంత మేర సాయం

ఆ రంగం ఈ రంగం అని లేదు.. ఇప్పుడు అన్ని రంగాల వారు కరోనాతో బాధపడుతున్నారు. ఐటీ రంగమూ ఇబ్బందిపడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్‌లలో పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నారు. వారిలో కుటుంబాలకు దూరంగా ఉంటున్నవాళ్లు, బ్యాచిలర్లు చాలా మంది ఉన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఇలాంటి వారికి తోడ్పాటు అందించేందుకు కొందరు కార్పొరేట్‌ ఉద్యోగులు తామే కుటుంబంగా మారారు. ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా చేయూత అందిస్తున్నారు.
– సాక్షి, హైదరాబాద్‌

సెకండ్‌ వేవ్‌ వేళ.. కాలక్షేపపు, అపోహలు పెంచే వాట్సాప్‌ గ్రూప్‌లకు భిన్నంగా తెలంగాణ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ (టీఎఫ్‌ఎమ్‌సీ) కరోనా హెల్ప్‌ డెస్క్‌ వాట్సాప్‌ గ్రూప్‌ పనిచేస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో నెల రోజుల కింద టీఎఫ్‌ఎమ్‌సీ ఏర్పాటైంది. ఆస్పత్రుల్లో బెడ్స్, ప్లాస్మా, కోవిడ్‌ పేషెంట్‌కి ఫోన్‌ కన్సల్టేషన్, రోగులు సమీపంలోని ఆస్పత్రులకు చేరేందుకు సహకరించడం, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ అందేలా తోడ్పడటం, అంబులెన్స్‌ సపోర్ట్‌.. వంటి సాయాన్ని ఆ గ్రూప్‌ ద్వారా అందిస్తున్నారు. 

ఒత్తిడిలో ఉన్నారు
సైబరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,500కి పైగా ఐటీ కార్యాలయాలకు చెందిన దాదాపు 6.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని టీఎఫ్‌ఎంసీ వాట్సాప్‌ గ్రూప్‌ నిర్వాహకుడు ఎం.సత్యనారాయ ణ చెప్పారు. ఐటీ పరిశ్రమలో పనిచేసే కొందరు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో వారికి మద్దతు అవసరమని గుర్తిం చి గ్రూప్‌ను నెలకొల్పామని తెలిపారు. ఈ వాట్సా ప్‌ గ్రూప్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సేవలు అందిస్తుందని చెప్పామ ని.. కానీ దాదాపు రోజు మొత్తం పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. తమ గ్రూప్‌లో ప్రస్తుతం 200 మంది సభ్యులు ఉన్నారన్నారు.

నిజమైన సాయం కోసం
టీఎఫ్‌ఎమ్‌సీ కరోనా హెల్ప్‌ డెస్క్‌ ఒక వాట్సాప్‌ డెస్క్‌. దీనిని విభిన్న సంస్థలకు చెందిన మోహిని, షానోజ్, గిరీష్, సత్యనారాయణ, శ్రుతి, సంధ్య, స్వప్న, రమాకాంత్, శ్రీనివాస్‌ తదితరులు అడ్మిన్స్‌గా నిర్వహిస్తున్నారు. వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియా గ్రూపుల్లో వివిధ అవసరాల కోసం సంప్రదించండి అంటూ షేర్‌ అవుతున్న నంబర్లలో 90 శాతం నకిలీవేనని వారు చెప్తున్నారు. తాము మాత్రం వీలైనంత వరకు సాయం అందించే ఉద్దేశంతో గ్రూప్‌ ఏర్పాటుచేశామని స్పష్టం చేస్తున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంత నివాసితులు, ఐటీ ఉద్యోగులకే ప్రధానంగా సేవలు అందిస్తున్నా.. మిగతా రంగాల వారికి కూడా వీలును బట్టి తప్పక సహకరిస్తామని అంటున్నారు. తమ హెల్ప్‌ డెస్క్‌ వాట్సాప్‌ నంబర్‌ 6309371600 ద్వారా అభ్యర్ధనలు తెలుపవచ్చన్నారు.

నిరుపేదల కోసం  ఆక్సిజన్‌ హబ్‌
ఇంట్లో తగినన్ని సౌకర్యాలు సమకూర్చుకోలేని మైల్డ్‌ లక్షణాలున్న పేద కోవిడ్‌ రోగుల కోసం టీఎఫ్‌ఎమ్‌సీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ చందానగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఐసోలేషన్‌ కమ్‌ ఆక్సిజన్‌ హబ్‌ను ఈ గ్రూప్‌ నెలకొల్పుతోంది. దీనిని గురువారం ప్రారంభించనుంది. ఇందులో 14 రోజుల పాటు ఉచిత వసతి, అన్ని రకాల మందులు, ఆహారం, నర్సింగ్‌ కేర్‌తో పాటు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్, ఆక్సిమీటర్స్‌ తదితర సదుపాయాలు సిద్ధంగా ఉంచుతున్నారు. ఏకకాలంలో 30 మందికి చోటు కల్పించవచ్చు. జీహెచ్‌ఎమ్‌సీ, ఐకియా, హార్స్‌కో, గ్రామెనెర్, జెనోటీల సహకారంతో దీనిని నిర్వహిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. ఈ హబ్‌లో ఉండగా అత్యవసర పరిస్థితి వస్తే తరలించడానికి అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచామన్నారు.

బెడ్స్‌ కోసమే ఎక్కువ
మాకు గత 10 రోజుల్లో 637 అభ్యర్థనలు వచ్చాయి. 600 అభ్యర్ధనలను మేం ఫుల్‌ఫిల్‌ చేశాం. ఇందులో 230 వరకూ అన్ని వసతులూ ఉన్న బెడ్స్‌ కోసం కాగా.. బ్లడ్, ప్లాస్మా కోసం 80, డాక్టర్‌ కన్సల్టేషన్‌ కోసం 25, ఆక్సిజన్‌  సప్లై కోసం 82 అభ్యర్థనలు వచ్చాయి. కేవలం హైదరాబాద్‌ నుంచి మాత్రమే కాకుండా వైజాగ్, విజయవాడ, నెల్లూర్, వరంగల్, తిరుపతి నగరాల నుంచి కూడా 130 మంది కాల్స్‌ చేశారు. అంబులెన్స్‌ గురించి కూడా పెద్ద సంఖ్యలో కాల్స్‌ వచ్చాయి 
– మోహిని చైతన్య, టీఎఫ్‌ఎంసీ సభ్యులు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-05-2021
May 13, 2021, 05:23 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఈ ప్రభావం...
13-05-2021
May 13, 2021, 05:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌తో ప్రాణాలుపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య రెండున్నర...
13-05-2021
May 13, 2021, 05:12 IST
జెనీవా: విషయంలో వరుసగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ దారుణ సంక్షోభ పరిస్థితి నెలకొన్నదని కోవిడ్‌ 19పై అధ్యయనం...
13-05-2021
May 13, 2021, 04:42 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్‌ సమస్యను తీర్చేందుకు డీఆర్‌డీవో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. బాధితుల శరీరంలోని మోతాదులకు...
13-05-2021
May 13, 2021, 04:26 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్‌ సంతృప్తి వ్యక్తం...
13-05-2021
May 13, 2021, 04:18 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట ‘వేరియంట్‌’. శాస్త్రీయంగా దీని గురించి ప్రజలకు...
13-05-2021
May 13, 2021, 04:05 IST
కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ఆచార్యులు, వరంగల్‌కు చెందిన...
13-05-2021
May 13, 2021, 03:53 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సర్పంచుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను...
13-05-2021
May 13, 2021, 03:47 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్‌...
13-05-2021
May 13, 2021, 03:24 IST
సాక్షి, గాంధీ ఆస్పత్రి: బాబోయ్‌ కరోనా అంటూ యువతే బయపడుతున్న వేళ.. 110 యేళ్ల తాత ధైర్యంగా వైరస్‌ను జయించాడు. ఇప్పటివరకు...
13-05-2021
May 13, 2021, 03:17 IST
సాక్షి, హైదరాబాద్‌:  ‘కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాక రెండో డోసు తీసుకోవడం ఆలస్యమైతే వృథా అవుతుందా? నిర్దిష్ట గడువు...
13-05-2021
May 13, 2021, 03:11 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు స్పష్టమైన చికిత్స లేదు. శాస్త్రీయంగా రుజువులు ఉన్న మందులను చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్‌లో కొందరు...
13-05-2021
May 13, 2021, 02:46 IST
సాక్షి ముంబై: మహారాష్ట్రలో మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు పొడిగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన...
13-05-2021
May 13, 2021, 02:26 IST
సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తొలి రోజు లాక్‌డౌన్‌ పకడ్బందీగా జరిగింది. ఉదయం ఆరు నుంచి పది గంటల...
13-05-2021
May 13, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ...
13-05-2021
May 13, 2021, 01:37 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తొలి రోజు బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం...
13-05-2021
May 13, 2021, 01:34 IST
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికార...
13-05-2021
May 13, 2021, 00:51 IST
న్యూఢిల్లీ: బిహార్‌లోని గంగా నదిలో భారీ సంఖ్యలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంగా పరీవాహక...
13-05-2021
May 13, 2021, 00:49 IST
భారత్‌లో కనీవినీ ఎరుగని విధ్వంసానికి కారణమవుతున్న కొత్త రకం కరోనా వైరస్‌ వెనక ఉన్న అసలు వాస్తవాన్ని అంచనా వేస్తున్నదానికంటే...
13-05-2021
May 13, 2021, 00:30 IST
దేశంలో కోవిడ్‌ టీకామందు (వాక్సిన్‌) అవసరం, కొరత తీవ్ర స్థాయికి చేరింది. పలు రాష్ట్ర ప్రభు త్వాలను ఆందోళనకు గురిచేస్తోంది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top