ఆన్‌లైన్‌లోనే టీచర్ల బదిలీలు | Teachers Transfers And Promotions Will Be Done Online: Sabitha Indra Reddy | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లోనే టీచర్ల బదిలీలు

Jan 25 2023 2:04 AM | Updated on Jan 25 2023 8:24 AM

Teachers Transfers And Promotions Will Be Done Online: Sabitha Indra Reddy - Sakshi

తాండూరు: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతు లన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తన పుట్టిల్లయిన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కోటబాస్పల్లిలో ఎల్లమ్మ దేవత ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణలను సబిత ఖండించారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, అవగాహన రాహిత్యంతోనే ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. బదిలీలు, పదోన్నతులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈసారి కూడా తాను మహేశ్వరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement