‘12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడాను’ | MLA Sabitha On Obulapuram Mining Case | Sakshi
Sakshi News home page

‘12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడాను’

May 6 2025 6:58 PM | Updated on May 6 2025 7:47 PM

MLA Sabitha On Obulapuram Mining Case

హైదరాబాద్‌: 12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడానన్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  ఓబులాపురం మైనింగ్‌ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్‌ కృపానందంలకు కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 

అనంతరం ఆమె మాల్లాడుతూ.. ‘న్యాయస్థానం నన్ను నిర్దోషి గా ప్రకటించింది, న్యాయస్థానంకి ధన్యవాదాలు. ఏ తప్పు చేయకపోయిన కోర్ట్ మెట్లు ఎక్కాను. పన్నెడున్నర సంవత్సరాలు నన్ను రాజకీయంగా అవమానించారు. ఈ కేసులను ముందు పెట్టి నన్ను రాజకీయంగా అణిచివేయాలనుకున్నారు  న్యాయస్థానం మీద నమ్మకం ఉంచాను కాబట్టి ఇవ్వాళ నాకు న్యాయం జరిగింది. 

నాపై ఎన్ని ఆరోపణలు చేసినా నా నియోజకవర్గ ప్రజలు నా వెంట నిలబడ్డారు’ అని అన్నారు. కేసు నమోదు అయిన తరువాత ఇదే సీబీఐ కోర్ట్ కి నేను కనీళ్లతో కోర్ట్ మెట్లు ఎక్కాను. నాపై రాజకీయంగా ఎన్నో ఆరోపణలు చేశారు. నేను అవినీతి చేశానని, జైలుకు పోతానని హేళన చేశారు. ఇన్నాళ్లకు నాకు న్యాయం జరిగింది’ అని అన్నారు సబితా ఇంద్రారెడ్డి.

ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు

Advertisement
 
Advertisement
Advertisement