జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్‌

TBJP Leader Jitta Balakrishna Reddy Arrest - Sakshi

అర్ధరాత్రి బీజేపీ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీసుల తీరుపై బండి సంజయ్‌ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్‌ 2వ తేదీన నిర్వహించిన ‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో కేసీఆర్‌ను కించపరిచేలా ‘స్కిట్‌’ చేశారని టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడమేంటని జిట్టా పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆయన మాటలను పట్టించుకోని పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్టు చేశారు.

అయితే జిట్టాను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియరాలేదు. అర్ధరాత్రి ఎలాంటి నోటీసు లేకుండా పోలీసులు తమ పార్టీ నేతను అరెస్టు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోపిడీ దొంగలమాదిరిగా తమ పార్టీ నేతను కిడ్నాప్‌ చేశారని ఆయన మండిపడ్డారు. వెంటనే జిట్టా ఆచూకీ తెలపాలని, ఆయనను విడుదల చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. జిట్టాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top