దయ్యం భయంతో హాస్టల్‌ ఖాళీ!  

Students Fear To Ghost Shadow In Hostel In Nizamabad - Sakshi

సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్‌): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేట ఆదర్శ కళాశాల హాస్టల్‌ విద్యార్థినులు దయ్యం భయంతో వసతి గృహాన్ని ఖాళీ చేశారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్స్‌లో భాగంగా చదువుకుంటున్న విద్యార్థినులకు గదిలో నీడలాగ ఒక ముఖం కనిపించిందని, వెనుకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని, వింత శబ్దాలు వినిపించాయని చెప్పారు.

దీంతో బెదిరిపోయిన విద్యార్థినులు బుధవారం ఉదయమే సొంత ఊర్లకు వెళ్లిపోయారు. కాగా, విద్యార్థినులు హోమ్‌సిక్‌ తోనే వెళ్లిపోయారని, తిరిగి రాగానే వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపల్‌ శ్రీలత పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top