‘కుమురం’ మ్యూజియానికి భూమి ఏదీ?

State Government Ignores Ranji Gond: Kishan Reddy - Sakshi

రాంజీ గోండునూ పట్టించుకోని రాష్ట్ర సర్కారు: కిషన్‌రెడ్డి

సాక్షి, వరంగల్‌: స్వాతంత్య్ర సమరయోధుడు కుమురం భీమ్, రాంజీ గోండు స్మారక మ్యూజి యంల కోసం కేంద్రం రూ.30కోట్లు మంజూరు చేసి రెండేళ్లైనా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ భూములు కేటాయించలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. డీపీఆర్‌ సిద్ధం చేసేందుకు రూ.కోటిచ్చినా ఇప్పటికీ అడుగుముందుకు పడలేదని మండి పడ్డారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామ రాజు మ్యూజియం పనులు కూడా ప్రారంభమ య్యాయని తెలిపారు.

వరంగల్‌లోని వేయి స్తంభా ల గుడి, భద్రకాళి దేవాలయాల్లో కిషన్‌ రెడ్డి మంగళ వారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయి స్తంభాల గుడి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమంలో జైలుకెళ్లిన ఘంటసాల జయంతి శతాబ్ది ఉత్సవాలను ఢిల్లీ, హైదరాబాద్, ఏపీలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుందన్నారు. జూలై 4న అల్లూరి సీతా రామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందు కు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారని తెలిపారు.

గవర్నర్‌పై కక్షసాధింపు..: కేంద్ర ప్రభుత్వ ఆస్పి రేషన్‌ డిస్ట్రిక్ట్స్‌ కింద ఎంపికైన భూపాలపల్లి జిల్లాలో వైద్యం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల కల్ప నకు నీతి ఆయోగ్‌ ద్వారా నిధులు కేటాయిస్తున్నా మన్నారు. కౌశిక్‌రెడ్డిని నామి నేటెడ్‌ ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్‌ పంపిన ప్రతిపాదనను ఒప్పు కోకపోవడంవల్లే గవర్నర్‌పై కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ... వెంటనే వరి ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top