టీజేఎస్‌కు శ్రీశైల్‌రెడ్డి రాజీనామా

Srishail Reddy Resigns To TJS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీకి, జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్‌ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శ్రీశైల్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సమాజం కోసం రాజకీయంగా చేయాల్సినంత చేయలేకపోతున్నామని, టీజేఎస్‌ ఆ దిశగా ముందుకు పోవడంలేదని, ఇంకా ఉద్యమ పంథా తప్ప రాజకీయ ధోరణి లేదనే తీవ్ర అసంతృప్తి, బాధతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. లోతైన, సునిశితమైన ఆలోచన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కు పంపిన లేఖలో పేర్కొన్నారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top