అమ్మానాన్న సరైన పేరు పెట్టలేదని.. డయల్‌ 100కు ఫిర్యాదు

Son Complaint To Police Over His Name In Sangareddy District - Sakshi

నారాయణఖేడ్‌: అమ్మా.. నాన్న వీళ్ళిద్దరూ లేకుంటే మనకి ఈ జీవితం లేదు . ఈ పంచభూతాలను పరిచయం చేసిన దైవాలు వారు.. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే.. వారు తిన్నా.. తినకపోయినా పిల్లల కడుపును మాత్రం ఎప్పుడు నింపేందుకు తీవ్రంగా శ్రమిస్తారు.పిల్లలు పుట్టిన తర్వాత వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ వారికి ఏ రకమైన బట్టలు కొనాలి? ఎం పేరు పెట్టాలి?  ఏ స్కూల్లో చదివించాలి? అలా ఉన్నతమైన ఉత్తమమైనది ఎంపిక చేసి పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తుంటారు..

ఇంత చేస్తున్నా ఆ తల్లిదండ్రులని నేడు యువత అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పవచ్చు.. నిత్యం ఎక్కడో ఒకచోట తల్లిదండ్రుల మీద ఆకృత్యాలకు పాల్పడుతున్న పిల్లల వార్తలను మనం  గమనిస్తూనే ఉన్నామ్. 

ఇందులో ముఖ్యంగా ఒక చోట ఏం సంపాదించి ఇచ్చారని వారిపైకి గొడవకు వెళుతున్న పిల్లలైతే.. మరో చోట అడిగింది కొనిపెట్టలేదని కక్ష పెంచుకొని ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్న వారు మరికొందరు. తల్లిదండ్రులు ఎంత శ్రమిస్తే మన జీవితం ఇలా ఆనందమయంగా సాగుతుందన్న విషయాన్ని మరిచి వారిపైనే దాడికి పాల్పడుతున్న సంఘటనలు అనేకం. ఇప్పుడు మనం చర్చించుకునే ఈ వార్త ఇంకాస్త చిత్రంగా కొత్తగా అనిపించక మానదు.  ఓ ప్రబుద్ధుడు తనకు మంచి పేరు పెట్టలేదని కని, పెంచిన తల్లిదండ్రులపైనే కోపం పెంచుకున్నాడు. నిత్యం వారిని ఈ విషయంలో వేధిస్తూ  వాదనకు దిగేవాడు. ఈ ఆలోచన తారా స్థాయికి చేరిన ఆ యువకుడు  మంచి పేరు పెట్టలేదని ఏకంగా 100 నంబర్ కు ఫోన్ చేసి తల్లిదండ్రులపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు అవాక్కయ్యారు.  ఇదేంటిది.. కొత్తగా.. వింతగా అని ఆలోచించడం వారివంతయింది.

ఈ ఘటన  సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లోని కిషన్ నాయక్ తండాలో ఇటీవల చోటు చేసుకుంది.  ఇంతకీ ఆ యువకుడి పేరు ఏంటో తెలుసా.. కర్ర సురేష్.  అతడి వయసు 23 సంవత్సరాలు. కాగా పోలీసులు ఈ విషయంపై మాట్లాడుతూ ఇలాంటి అంశాలపై ఫిర్యాదు చేసి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని, ఇలా చేయడం వల్ల అత్యవసరంలో ఉన్న వారికి ఫోన్ లైన్ దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top