బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు తీవ్ర కొరత.. మందులు తక్కువ.. బాధితులెక్కువ..!

Shortage Of Anti Fungal Drug Ampho B To Treat Black Fungus - Sakshi

దేశంలో ఆంఫోటెరిసిన్‌ బి నోస్టాక్‌ 

ప్రాధాన్య క్రమంలో కేటాయిస్తున్న కేంద్రం 

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న బాధితులు 

కేంద్రం నుంచి సరిపడా కేటాయింపుల్లేక అవస్థలు 

సాక్షి, హైదరాబాద్‌: బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు చికిత్స జటిలమవుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో ఈ ఫంగస్‌ బాధితులు పెరిగిపోతుండగా.. వారికి సరైన వైద్యం ఇచ్చేందుకు సరిపడా మందుల్లేక కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికే బ్లాక్‌ఫంగస్‌ బాధితుల సంఖ్య దాదాపు 600 దాటింది. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని ప్రత్యేకంగా బ్లాక్‌ఫంగస్‌ చికిత్స కోసం కేటాయించారు. దీనికితోడు గాంధీ ఆస్పత్రిలో కూడా బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో కీలకమైన లైపోజోమల్‌ ఆంఫోటెరిసిన్‌ బి. కానీ ఈ మందు నిల్వలకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఉంది. దీంతో ఈ మందులను కేంద్రమే రాష్ట్రాలకు కేటాయిస్తూ వస్తోంది. 

రాష్ట్రానికి 890 వయల్స్‌ కేటాయింపు.. 
బ్లాక్‌ ఫంగస్‌ కేసులు అత్యధికంగా గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈనెల 20 నాటికి 8,848 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తించారు. 23,680 లైపోజోమల్‌ ఆంఫోటెరిసిన్‌–బి మందులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యత క్రమంలో కేంద్రం కేటాయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 890 వయల్స్‌ కేటాయించగా.. అందులో సగం స్టాకు మాత్రమే రాష్ట్రానికి చేరుకుంది. ఆంఫోటెరిసిన్‌– బి మందుకు ప్రత్యామ్నాయమైన పొసకొనజోల్, ఫ్లూకొనజోల్‌ మందులను వినియోగించే వీలున్నప్పటికీ.. వీటికి సైతం కొరత ఏర్పడటంతో వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఈ మందుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఓ కమిటీని నియమించింది.

సంబంధిత రోగి బంధువులు ఎవరైనా చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్‌ నుంచి ఈ ఇంజెక్షన్‌ కావాలంటూ లిఖిత పూర్వక చీటీతో పాటు, రోగి పూర్తి వివరాలతో ent& mcrm@telangana. gov.inకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులన్నింటినీ కమిటీ పరిశీలించి.. ఎవరికి అవసరం ఉందో ప్రిస్కిప్షన్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ కమిటీ సంతృప్తి చెందితే.. వారికి ఆ ఇంజెక్షన్‌ మంజూరు చేస్తూ మెయిల్‌ పంపిస్తారు. ఈ ఇంజెక్షన్‌లు ఏ డిస్ట్రిబ్యూటర్‌ వద్ద లభిస్తాయో మెయిల్‌ లో పేర్కొంటారు. అక్కడికి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మందులను ప్రభుత్వమే నియంత్రించడం వల్ల బయట ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఆస్పత్రులకు వచ్చిన తర్వాత కూడా ఈ మందులను కొందరు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-05-2021
May 24, 2021, 03:35 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్‌ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి...
24-05-2021
May 24, 2021, 03:34 IST
న్యూఢిల్లీ: ఫార్మా రంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కోవిడ్‌–19 చికిత్సకు నూతన విధానాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్ని...
24-05-2021
May 24, 2021, 03:26 IST
కరోనా రాక ముందు.. వచ్చిన తర్వాత.. ఇంటి బడ్జెట్, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల విషయంలో ఎక్కువ మంది అంగీకరించే మాట...
24-05-2021
May 24, 2021, 02:20 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌వేవ్‌ తరుణంలో ఇటీవల కొత్తగా వినిపిస్తున్న పేరు వైట్‌ ఫంగస్‌. కొద్దిరోజులుగా బ్లాక్‌ ఫంగస్‌ చేస్తున్న...
24-05-2021
May 24, 2021, 02:08 IST
సాక్షి, కాళేశ్వరం: బ్లాక్‌ ఫంగస్‌ ఓ రైతు కుటుంబాన్ని కకావికలం చేసింది. చికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చు చేయగా.. ప్రస్తుతం...
24-05-2021
May 24, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్‌ కుటుంబంలో ఒక్కరికి సోకితే మిగతా సభ్యులందరికీ వేగంగా వ్యాప్తి చెందుతోంది....
24-05-2021
May 24, 2021, 01:42 IST
కరోనా బాధితుల్లో ప్రస్తుతం నీళ్ల విరేచనాలు సర్వ సాధారణంగా కనిపిస్తున్న లక్షణం. బాధితుల విసర్జితాల్లో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ లేదా జెనెటిక్‌...
23-05-2021
May 23, 2021, 20:22 IST
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యమంటే తమాషా కాదంటూ బాబా రామ్‌దేవ్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌. అల్లోపతి వైద్యంపై...
23-05-2021
May 23, 2021, 18:28 IST
అహ్మదాబాద్‌: ప్రాణాంతక కరోనాను జయించామనే ఆనందం లేకుండా చేస్తున్నాయి బ్లాక్‌ఫంగస్‌, వైట్‌ఫంగస్‌ వ్యాధులు. ఫంగస్‌ వ్యాధులతోనే సతమతం అవుతుంటే ఇప్పుడు వీటికి...
23-05-2021
May 23, 2021, 18:13 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 91,629 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18,767 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,77,932...
23-05-2021
May 23, 2021, 15:42 IST
జెనీవా: నాసల్‌ వ్యాక్సిన్‌ వస్తేనే ఇండియాలో విద్యా వ్యవస్థ గాడిన పడుతుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌​ సౌమ్య స్వామినాథన్‌....
23-05-2021
May 23, 2021, 10:29 IST
బెంగళూరు: కరోనా కరాళనృత్యానికి కుటుంబాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి. అలాంటిదే ఇది. కరోనా కర్కశత్వానికి ఇదో మచ్చుతునక. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన...
23-05-2021
May 23, 2021, 09:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ కోసం దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు వ్యాక్సిన్ల కొరతతో అడ్డంకులు వస్తున్నాయి. ఢిల్లీలో అనేక...
23-05-2021
May 23, 2021, 08:18 IST
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక కోవిడ్‌ మరణాలకు ప్రధాని మోదీ కన్నీరు కార్చడమే కేంద్ర ప్రభుత్వం స్పందన అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌...
23-05-2021
May 23, 2021, 05:34 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రకోపం కాస్తంత తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నెల పదో తేదీన 24.83 శాతంగా...
23-05-2021
May 23, 2021, 05:25 IST
ఇండియానాపొలిస్‌(అమెరికా): దేశం మొత్తమ్మీద కోవిడ్‌–19 నిరోధక టీకాలు తీసుకున్న వారి సంఖ్య 20 కోట్లకు చేరువ అవుతోంది. తొలి డోసు...
23-05-2021
May 23, 2021, 05:03 IST
పెదబయలు: కోవిడ్‌పై గ్రామాల్లో అవగాహన పెరుగుతోంది. లేనిపోని భయాలు తగ్గి..తగు జాగ్రత్తలతో మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి బాంధవ్యాలను,...
23-05-2021
May 23, 2021, 04:42 IST
దుగ్గిరాలపాడు (జి.కొండూరు): చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠంలా.. 2017లో డెంగీ జ్వరాలతో అల్లాడిపోయిన దుగ్గిరాలపాడు గ్రామ ప్రజలు నేడు...
23-05-2021
May 23, 2021, 03:51 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సిన్‌ను అందరికీ ఉచితంగా వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోయినప్పటికీ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌...
23-05-2021
May 23, 2021, 03:17 IST
ముంబై సెంట్రల్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా మహమ్మారి విశ్వరూపం ఇంకా కొనసాగుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top