పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. | Shilparamam Will Reopen From October 2nd | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 2న శిల్పారామం రీఓపెన్‌..

Sep 26 2020 5:05 PM | Updated on Sep 26 2020 5:12 PM

Shilparamam Will Reopen From October 2nd - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైటెక్‌ సిటీ చెంత పల్లె అందాలతో కనువిందు చేసే శిల్పారామం అక్టోబర్‌ 2 నుంచి తెరుచుకోనుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా మూసివేసిన శిల్పారామం తిరిగి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచి ఉండ‌నుంది. పర్యాటకుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తరువాతే లోపలికి అధికారులు అనుమతించనున్నారు. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ‌నివారం నుంచి అర్బ‌న్ పార్కుల‌ను తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన విష‌యం విదిత‌మే. క‌రోనా నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి సంద‌ర్శ‌కుల‌కు శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని, మాస్కులు ధ‌రించిన వారినే లోప‌ల‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. (చదవండి: వారిని నమ్మొద్దు: మంత్రి కేటీఆర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement