ఈ నెల 11న షీ పవర్‌ ఉమెన్స్‌ బైక్‌ ర్యాలీ | She Power Women's Bike Rally on the 11th of this month | Sakshi
Sakshi News home page

ఈ నెల 11న షీ పవర్‌ ఉమెన్స్‌ బైక్‌ ర్యాలీ

Oct 10 2026 10:39 AM | Updated on Oct 10 2026 10:39 AM

She Power Women's Bike Rally on the 11th of this month

హైదరాబాద్ : అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీన జలవిహార్‌ వద్ద షీ పవర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భారీ ఉమెన్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు షీ పవర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు అల్పన భారతి, అపూర్వ తెలిపారు.

శుక్రవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లో ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో వారు కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతతో పాటు బాలికా విద్య కోసం నిర్వహించే ఈ బైక్‌ ర్యాలీలో నగరానికి చెందిన మహిళా బైకర్లతో పాటు నేపాల్, భూటాన్, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొంటారని తెలిపారు.

ఈ బైక్‌ ర్యాలీని టూరిజం శాఖా మంత్రి జూపల్లి కష్ణారావు, ఐపీఎస్‌ శిల్పవల్లి, మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతిరెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని వెల్లడించారున. సుమారు 500 మంది మహిళా బైకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఎస్‌ఐ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement