Senior Congress Leader Jana Reddy Hospitalized Due To Health Issue - Sakshi
Sakshi News home page

టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డికి అస్వస్థత

Apr 12 2023 10:48 AM | Updated on Apr 12 2023 11:19 AM

Senior Leader Jana Reddy Admitted In Hospital Due To Health Issue - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు.

జానారెడ్డికి యాంజియో గ్రామ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుపోయినట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి యశోదా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
చదవండి: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement