బడిబుడి అడుగులు | Schools reopen in Hyderabad after 49-day summer vacation | Sakshi
Sakshi News home page

బడిబుడి అడుగులు

Jun 13 2025 4:01 AM | Updated on Jun 13 2025 4:01 AM

Schools reopen in Hyderabad after 49-day summer vacation

ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆనందోత్సాహం

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పాఠశాలలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రతీచోట తొలి రోజు హడావిడి కనిపించింది.  విద్యార్థులకు.. స్థానిక నేతలు, విద్యాశాఖ అధికారులు స్వాగతం పలికారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో స్వాగత బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. యాభైరోజుల తర్వాత కలుసు కున్న విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవ డం కనిపించింది. అన్నిచోట్ల తొలిరోజే పాఠ్యపుస్త కాలు, యూనిఫాం అందించారు. మొత్తంగా 50 లక్షల పాఠ్యపుస్తకాలు, 20 లక్షల యూనిఫాం అంద జేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠ శాల ప్రారంభం రోజే పుస్తకాలు, యూనిఫాం అందించాలని సీఎం కార్యాలయం అన్ని జిల్లా లకు ఆదే శాలు ఇచ్చింది. పంపిణీ కార్యక్రమాలపై సీఎంవో వివరాలు తెప్పించుకుంది.

కొన్ని జిల్లాల్లో పుస్తకాల పంపిణీ ఆలస్యమవ్వడం, మరికొన్ని చోట్ల అందరికీ అందుబాటులో యూనిఫాం లేకపోవడంతో పంపిణీ జరగలేదు. వారం రోజుల్లో అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా రు.  పాఠశాలలను తెరిచే నాటికే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,852  ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల పాఠశా లలకు 1,01,66,220 పుస్తకాలు చేరాయని ముఖ్య మంత్రి కార్యాలయం తెలిపింది. తొలిరోజు పాఠశాల లకు 8,33,398 లక్షల మంది హాజరయ్యారని, వీరిలో 54,52,708 మందికి పుస్తకాలు అందించా మని సీఎంవో పేర్కొంది.

ఈ ఏడాది మొత్తం 20,30,667 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రోజు పాఠశాలలకు హాజరైన 8,33,398 విద్యార్థులకు ఒక జత యూనిఫాంలను ఉపాధ్యాయులు అందజేశారు. రెండో జత త్వరలో అందిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి పాఠశా లల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను ఒక సబ్జెక్టుగా బోధిస్తారు. దీనికి సంబంధించిన పుస్తకాలను కూడా విద్యార్థులకు అందజే శారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో తొలి రోజు విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement