నేటి నుంచి బడులకు సెలవులు | School holidays from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బడులకు సెలవులు

Apr 24 2026 3:38 AM | Updated on Apr 24 2026 3:38 AM

School holidays from today

పది ఫలితాలు మే 4 లేదా 5న 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలలకు శుక్రవారం సెలవులు ప్రారంభం అవుతున్నాయి. జూన్‌ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా పదవ తరగతి ఫలితాలు వచ్చే నెల 4 లేదా 5వ తేదీన వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈనెల 16వ తేదీన ముగిసాయి.

ఎస్‌ఎస్‌సీ బోర్డు మూల్యాంకనం వేగవంతం చేసి.. త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు అధికారవర్గాల సమాచారం. అధికారులు మాత్రం ఫలితాలు వెల్లడించే కచి్చతమైన తేదీని అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement