Khammam: ఎస్‌బీఐ ఉద్యోగుల నిర్లక్ష్యం.. బ్యాంక్‌కు తలుపులు వేయకుండానే!

SBI Officials Went Out Without Closing Bank Gates At Khammam District - Sakshi

సాక్షి, ఖమ్మం: ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు ఎస్‌బీఐ ఉద్యోగులు బ్యాంకుకు తలుపులు వేయకుండానే వెళ్లిపోయిన ఘటన ఇది. ఈనెల 15వ తేదీ బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రతిరోజూ బ్యాంకు సమయం పూర్తయ్యాక స్ట్రాంగ్‌రూమ్‌తో పాటు అన్ని తలుపులకు షట్టర్లు, తాళాలు వేసి వెళ్తారు. అయితే, ఈనెల 15వ తేదీన సాయంత్రం మాత్రం ఉద్యోగులు విధులు ముగించుకుని ప్రధాన ద్వారం తలుపులు వేయకుండానే ఎవరికి వారు ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం.

సాయంత్రం నుంచి రాత్రి 10గంటల వరకు అలాగే ఉండగా అటుగా వచ్చిన గ్రామస్తులు గమనించి సర్పంచ్‌ జంగా పుల్లారెడ్డితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఏఎస్సై వి.వెంకటాచార్యులు, బ్లూకోట్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ చేరుకుని వెంటనే బ్యాంకుకు మేనేజర్‌ రవికుమార్, ఉద్యోగులను పిలిపించారని సమాచారం. అధికారులు వచ్చాక పోలీసులతో కలిసి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే ఎవరూ బ్యాంకులోకి ప్రవేశించలేదని నిర్ధారించుకున్న వారు. ఆతర్వాత తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారని తెలిసింది. కాగా, ఈ విషయం శుక్రవారం వెలుగులోకి రాగా.. వివరణ కోసం బ్యాంకు మేనేజర్‌ రవికుమార్‌కు ఫోన్‌ చేస్తే తర్వాత మాట్లాడుతానని బదులిచ్చారు.
చదవండి: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top