Gangireddulu Ataalu: ‘బసవన్న’ ఆశలు సంక్రాంతి పైనే

Sankranthi Basavanna Gangireddulu Ataalu in Villages - Sakshi

సాక్షి, పాల్వంచ(ఖమ్మం): సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు మూడురోజుల ముందునుంచే ఎక్కడ ఉన్న డూడూ బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తాయి. ఈ పండుగ గంగిరెద్దులను ఆడించేవారి జీవితాల్లో కొంత కాంతిని నింపి మూడు రోజుల ముందే ప్రారంభం కావడంతో పల్లెల్లో పండగశోభ సంతరించుకుంటుంది. కరోనా ప్రభావంతో గంగిరేద్దుల జీవితాల్లో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. వేకువజామున చలిలో గంగిరెద్దులతో ఇంటింట తిరిగడం కనపిస్తుంది.

గంగిరెద్దులు ఆడిచేవారికి పండగే ఆధారపడి ఉంటాయి. పండగ సందర్భంగా ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇస్తారు. ఇలా పండగ పూర్తి అయ్యేనాటికి వచ్చిన ఆధాయంతో ఆరునెలలపాటు సంతోషంగా కుటుంబం అంతాగడుపుతారు. తర్వాత కూలీపనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు.

చిన్నప్పటి నుంచే శిక్షణ
గంగిరెద్దులు విన్యాసాలు చేసే విధంగా వారు చిన్నప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ గంగిరెద్దులను నమ్ముకుని అనేక కుటుంబాలు పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్‌ మండలంలో జీవనం సాగిస్తున్నాయి. తాత ముత్తాతల నుంచి గంగిరెద్దులను ఆడించుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఎలాంటి వ్యవసాయ భూములు, ఇళ్లు, కనీసం రేషన్‌కార్డులు లేవని వాపోతున్నారు. సంక్రాంతి పండగ తోపాటు ఎవ్వరైన పెద్దవాళ్లు కాలం చేస్తే పదవ రోజున ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గంగిరెద్దులతో విన్యాసాలు చేయించి పరుగులు పెట్టిస్తారు.

ఇలా బసవన్నల ఆడించుకుంటుంటే దయగణాలు అంతో ఇంతో దానంచేస్తే వచ్చిన వాటితోనే జీవనంసాగిస్తున్నామని గంగిరెద్దులను ఆడించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, పింఛన్లు అందజేయాలని  వారు వేడుకుంటున్నారు.  

చదవండి: ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top