TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్‌ క్లారిటీ | Sajjanar Clarity On Charges Hike In Telangana Rtc Buses | Sakshi
Sakshi News home page

TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్‌ క్లారిటీ

Oct 14 2024 3:46 PM | Updated on Oct 14 2024 3:56 PM

Sajjanar Clarity On Charges Hike In Telangana Rtc Buses

సాక్షి,హైదరాబాద్‌: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ ఛార్జీలు పెంచలేదని సంస్థ ఎండీ సజ్జనార్‌ క్లారిటీ ఇచ్చారు.ఈ విషయమై సోమవారం(అక్టోబర్‌14) ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన ఒక పోస్టు చేశారు. టికెట్‌ ధరలు పెంచారన్న ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 

‘ఛార్జీలు పెంచారనే వార్తల్లో వాస్తవం లేదు. ఈ ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోంది. జీవో నెంబర్‌ 16 ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించింది.రెగ్యుల‌ర్ స‌ర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు లేదు.స్పెషల్‌ బస్సుల్లో డీజిల్‌ ఖర్చులకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు జీవో నెంబర్‌ 16 ప్రకారం’ఉంది అని సజ్జనార్‌ తెలిపారు.  
 

ఇదీ చదవండి: తెలంగాణ గ్రూప్‌1పై హైకోర్టు తీర్పు రేపు 

Advertisement
 
Advertisement
Advertisement