ఈస్టర్‌ ఫెస్టివల్‌.. రన్ ఫర్ జీసస్ ర్యాలీ | Run for Jesus Rally Draws hundreds onto streets in Hyderabad | Sakshi
Sakshi News home page

ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ

Published Mon, Apr 1 2024 4:25 PM | Last Updated on Mon, Apr 1 2024 4:32 PM

Run for Jesus Rally Draws hundreds onto streets in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈస్టర్‌ ఫెస్టివల్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రన్‌ ఫర్‌ జీసస్‌ ర్యాలీ’ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి ర్యాలీని ప్రారంభించారు. కార్డినల్ పూలే ఆంథోని ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవుల సోదరులు, యువతులు పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఫొటోలు.. సినీ నటుడు రాజా పర్యవేక్షణలో కొనసాగిన  ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.

 సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి అబిడ్స్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పూల ఆంథోని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని  అన్నారు ఏసుప్రభు అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉంటుందన్నారు. అనంతరం పూల ఆంథోనికి జ్ఞాపకం అందజేశారు రాజా. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన యువతకు రాజా శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement