ఆర్టీసీ బస్సులో సజ్జనార్‌ కుటుంబం.. వీడియో వైరల్‌

RTC MD VC Sajjanar And Family Travel In RTC Bus Video Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం అని తెలియజేయాడానికి ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సజ్జనార్‌కు సంబంధించి మరో వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దీనిలో సజ్జనార్‌ డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. ఆ వివరాలు.. 
(చదవండి: TSRTC: జర్నలిస్టులకు సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌)

సజ్జనార్‌ తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలసి ఎక్కడికో వెళ్తున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఆర్‌టీసీ బస్సును ఎంచుకున్నారు. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఇక బస్సులో మ్యూజిక్‌ ప్లే అవుతుండగా.. అందరు చిన్నపాటి స్టెప్పులు వేశారు. అందరితో పాటు సజ్జనార్‌ కూడా రెండు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.
(చదవండి: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్‌ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్‌ )

ఇది చూసిన నెటిజనుల.. ‘‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అంటూ ప్రచారాలకు మాత్రమే పరిమితం కాకుండా స్వయంగా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ అందరికి ఆదర్శంగా  నిలుస్తున్నారు.. మీరు గ్రేట్‌ సార్‌’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి: సజ్జనార్‌ ట్వీట్‌ వైరల్‌: ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు.. అయ్యయ్యో వద్దమ్మా..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top