తెలంగాణ: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ పెట్టిన సజ్జనార్‌

Round Up Charges In TSRTC Pallevelugu Buses Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌.. దీన్ని పరిష్కరించేందుకు రౌండప్‌ చార్జీలను ఖరారు చేశారు. గురువారం నుంచి ఈ కొత్త (రౌండప్‌) చార్జీలను అమలు చేయాలని ఆదేశించారు.

రూ.12చార్జీ ఉన్న చోట టికెట్‌ను రూ. 10 రౌండప్‌ చేసి ప్రయాణికుల వద్ద వసూలు చేయనున్నారు. రూ.13, రూ.14  ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 15గా రౌండప్‌ చేయనున్నారు. అలాగే.. 80 కీలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్‌ ఖరారుతో చార్జీలు రూ.65 మాత్రమే వసూలు చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top