రెండు ఆర్టీసీ బస్సుల ఢీ.. | Road Accident: Two RTC Buses Collide Injuries 40 People In Nirmal District | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సుల ఢీ..

Mar 8 2022 1:30 AM | Updated on Mar 8 2022 9:24 AM

Road Accident: Two RTC Buses Collide Injuries 40 People In Nirmal District - Sakshi

క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీస్తున్న స్థానికులు 

భైంసా(ముధోల్‌): నిర్మల్‌ జిల్లా భైంసా మండలం వానల్‌పాడ్‌ గ్రామ సమీపంలో రెండు ఆర్‌టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. వివరాలివి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భైంసా నుంచి నిర్మల్‌కు నిర్మల్‌ డిపోకు చెందిన బస్సు వెళ్తోంది. ఇందులో 43 మంది ప్రయాణికులున్నారు. వెనకాలే భైంసా డిపోకు చెందిన బస్సు సారంగపూర్‌ వెళ్తోంది.

ఇందులో 37 మంది ప్రయాణికులున్నారు. ఈ క్రమంలో భైంసా డిపో బస్సు నిర్మల్‌ డిపో బస్సును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో వెనకనుంచి ఢీ కొట్టింది. ఇద్దరు డ్రైవర్లు బ్రేక్‌ వేయడంతో రెండు బస్సుల్లో 40 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను భైంసా, నిర్మల్‌ ఆసుపత్రులకు తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement