ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి కన్నుమూత | Rajkumari Indira devi dhanraj gir passes away | Sakshi
Sakshi News home page

ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి కన్నుమూత

Jan 13 2026 9:50 PM | Updated on Jan 14 2026 8:39 PM

Rajkumari Indira devi dhanraj gir passes away

రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్ (96) ఈరోజు(మంగళవారం, జనవరి 13వ తేదీ) సాయంత్రం హైదరాబాద్‌లోని జ్ఞాన్‌భాగ్ ప్యాలెస్‌లో కన్నుమూశారు. ఆమె నిజాం కోర్టులో ప్రముఖ నోబెల్‌లో ఒకరైన రాజా ధనరాజ్ గిర్ కుమార్తె. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య రాజకుమారి ఇందిరాదేవి

రాజకుమారి ఇందిరాదేవి చిత్రకారిణి, రచయిత్రి, కవయిత్రి. ఆమె కవిత్వంలో హైదరాబాద్‌ సంస్కృతి, డెక్కన్‌ ప్రాంతపు జ్ఞాపకాలు, వ్యక్తిగత అనుభవాలు ప్రతిబింబిస్తాయి.

జీవిత చరిత్ర
జననం: 1930 ఆగస్టు 17
తల్లిదండ్రులు: రాజా ధనరాజ్‌గిర్జీ బహదూర్‌ , రాణి ప్రేమిలా దేవి
విద్య: ఇంటి వద్ద ఆంగ్ల గవర్నెస్‌ ద్వారా శిక్షణ పొందారు
వివాహం: ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ

సాహిత్య కృషి
ఇందిరా దేవి ఆంగ్లంలో కవిత్వం రాశారు. ఆమె రచనలు:
Return Eternity (1965)
Partings in Mimosa (1968)
-Memories of the Deccan (2008)

సామాజిక సేవలు
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో హిందీ అకాడమీకి ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.
సాహిత్యం, కళలు, ఫోటోగ్రఫీ రంగాల్లో విశేష కృషి చేశారు.

వ్యక్తిగత విశేషాలు
ఆమె పూర్వీకులు మహారాష్ట్రలో పాలకులు.
హైదరాబాద్‌లోని జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో నివసించారు.
తండ్రి క్రికెట్‌ను హైదరాబాద్‌కు పరిచయం చేసినవారిలో ఒకరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement