Drunk And Drive Case: వారంలో రూ.కోటిన్నర జరిమానా 

Rachakonda Traffic Police Fines Rs 1 Crore In Drunk And Drive Case - Sakshi

ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు 

రాచకొండ పరిధిలో 40,620 నమోదు.. 

49 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు.. రూ.4.38 లక్షల జరిమానా

సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, డ్రంకెన్‌ డ్రైవ్‌లు, పెండింగ్‌ చలాన్ల వసూళ్లపై రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య రాచకొండ పరిధిలో 40,620 కేసులను నమోదు కాగా.. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కలిపి సుమారు రూ.కోటిన్నర జరిమానా విధించారు. ఇందులో అత్యధికంగా హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 26,475 కేసులు నమోదు కాగా.. రూ.48,98,900 ఫైన్లు విధించారు. 

ఇద్దరికి జైలు శిక్ష
రాచకొండ కమిషరేట్‌ పరిధిలో వారం రోజుల్లో 49 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులను నమోదయ్యాయి. రూ.4,38,500 జరిమానా విధించారు. 176 మందిని కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష పడింది. అత్యధికంగా వనస్థలిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలదారులపై 38 కేసులు బుక్కవగా.. త్రీవీలర్స్‌పై 2, ఫోర్‌ వీలర్‌ వాహనాదారులపై 9 కేసులు నమోదయ్యాయి.  

54 రోడ్డు ప్రమాదాలు.. 10 మంది దుర్మరణం.. 
కమిషనరేట్‌ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 54 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. వీటిలో పది మంది దుర్మరణం చెందగా.. 50 మందికి గాయాలయ్యాయి. తీవ్రత వారీగా చూస్తే 10 కేసులు ఘోరమైన ప్రమాదాలు కాగా.. 44 సాధారణ రోడ్డు ప్రమాదాలున్నాయి. ఆయా డేటాను విశ్లేషించగా మానవ తప్పిదాలు, రహదారి ఇంజనీరింగ్‌ లోపాలతోనే జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, వాహనాలు వాటంతటవే ప్రమాదాలకు గురికావడం కారణాలని రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ డి.శ్రీనివాస్‌ తెలిపారు.  

ఏ విభాగంలో ఎన్ని కేసులంటే.. 

విభాగం కేసుల సంఖ్య జరిమానా 
(రూపాయల్లో) 
హెల్మెట్‌ లేకుండా 26,475      48,98,900 
 సీట్‌బెల్ట్‌ లేకుండా 129    12,900 
డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా 837    4,11,500 
అదనపు ప్రయాణికులు  28  7,200 
ఎక్స్‌ట్రా ప్రొజెక్షన్‌  415    41,500 
అతివేగం   2,023   20,23,000 
సిగ్నల్‌ జంప్‌  96 96,000 
ప్రమాదకర డ్రైవింగ్‌ 14 14,000 
సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ 96  96,000   
 

    
       
        
      

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top