నాగార్జున సాగర్‌ సందర్శించిన పీవీ సింధు

PV Sindhu Visits Nagarjuna Sagar Dam Along With His Family - Sakshi

సాక్షి, నల్గొండ : బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు నాగార్జున సాగర్‌లో సందడి చేశారు. ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి సాగర్‌ సందర్శించారు. సింధూ ప్రాజెక్ట్‌ వద్ద కుటుంబీకులతో కలిసి నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగారు. సాగర్ చేరుకున్న సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూపించారు. కాగా ప్రాజెక్ట్‌ 20 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదలడంతో ఆ సుందర దృశ్యాలను చూడటానికి పర్యాటకులు సాగర్‌ చేరుకుంటున్నారు.

భారీగా పోటెత్తిన వరద నీరు..
మరోవైపు కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 20 క్రస్ట్‌ గేట్లు 20 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు.

  • ఇన్ ఫ్లో: 6,06,754 క్యూసెక్కులు..
  • అవుట్ ఫ్లో: 6,06,754 క్యూసెక్కులు..
  • పూర్తిస్థాయి నీటినిల్వ: 312.0450 టీఎంసీలు..
  • ప్రస్తుత నీటి నిల్వ  : 312.0450 టీఎంసీలు.. 
  • పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు..
  • ప్రస్తుత నీటిమట్టం: 590 అడుగులు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top