సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట | Property Registrations Surge Ahead of Revised Market Values | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట

Jun 5 2026 8:21 AM | Updated on Jun 5 2026 11:12 AM

Property Registrations Surge Ahead of Revised Market Values

సాక్షి, సిటీబ్యూరో: సవరించిన భూముల మార్కెట్‌ విలువ శుక్రవారం నుంచి పెరగనుండటంతో.. రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరుగుతాయనే ఉద్దేశంతో గురువారం మూసాపేట్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చంపాపేట్, శంషాబాద్, గండిపేట్‌ తదితర సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయాలు దస్తావేజుదారులతో కిటకిటాడాయి. భూ విక్రయదారులు, బిల్డర్లతో ఆస్తుల అగ్రిమెంట్‌ చేసుకున్న కొనుగోలుదారులు రిజి్రస్టేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఆయా కార్యాలయాలు ఉద్యోగులు, డాక్యుమెంట్‌ రైటర్లు, క్రయ విక్రయదారులతో కిక్కిరిసిపోయాయి. పరిమితికి మించి స్లాట్లు బుక్‌ కావడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు సిబ్బంది రాత్రిపొద్దు పోయే వరకు ఆఫీసుల్లోనే ఉండి రిజి్రస్టేషన్ల ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.    

శంషాబాద్‌లో విజిలెన్స్‌ తనిఖీలు 
శంషాబాద్‌: శంషాబాద్‌ సబ్‌రిజి్రస్టార్‌ కార్యాలయంలో గురువారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు, దస్తావేజులను పరిశీలించారు. ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేపట్టారా? సాధారణ తనిఖీల్లో భాగంగానేనా? అనే విషయం బయటికి రాలేదు. రెండు గంటల పాటు రికార్డులు పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల తర్వాత అనేక ఆరోపణలు బయటపడడంతో తాజాగా సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ తనిఖీలపై చర్చ జరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement