పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

Post Graduate PG Medical Admission Process Started In Telangana - Sakshi

ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 

నోటిఫికేషన్‌ విడుదల చేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం

సాక్షి, హైదరాబాద్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) వైద్య ప్రవే శాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖా స్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. జాతీ­యస్థాయి అర్హత పరీక్ష (నీట్‌)– 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి.

దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. యూనివర్సిటీ పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ప్రకటి స్తుంది. దరఖా­స్తులను https://­tspgmed. tsche.in దరఖాస్తు ఫారం నింపే సమయంలో సాంకేతిక సమస్యలకు 93926 85856, 78425 42216, 90596 72216 నంబర్లకు, నిబంధనల కోసం 94905 85796, 85006 46769 నంబర్లకు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫోన్‌ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం  www. knruhs.telangana.gov.inను సంప్రదించాలని తెలిపింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top