ఛీ.. ఇదేం బుద్ధిరా నాయనా

Police Booked Case Against Dairy Farm Owner For Supplying Unhygienic Milk - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మీరు రోజు పాలు తాగుతారా.. అయితే ఈ వార్త చదవకపోవడమే మంచిది. సాధారణంగా పాలలో నీళ్లు కలుపుతారన్న మాట నిజమే.. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పనికి మాత్రం పాలు తాగాలనిపించదు. డబీర్‌పురకు చెందిన మహ్మద్‌ సోహైల్‌ డైరీ ఫాం​ నడుపుతున్నాడు. తాజాగా మహ్మద్‌ సోహైల్‌ గేదెల నుంచి పాలు పిండాడు. తర్వాత ఆ పాలను ఒక గ్లాస్‌లో పోసుకొని సగం తాగాడు. ఎంగిలి చేసిన మిగిలిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు. అనంతరం గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.(చదవండి : కేసీఆర్‌ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం, వ్యక్తి ఆరెస్ట్‌)

మహ్మద్‌ సోహైల్‌ చేసిన పనిని కొందరు యువకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు ప్రజలు తాగే పాలను ఇలా అపరిశుభ్రం చేస్తున్న వ్యక్తికి అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డబీర్‌పుర పోలీసులు డైరీ ఫామ్ యజమాని సోహైల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top