
దేశంలోనే ప్రప్రథమంగా టెక్ ఆధారిత ఓమ్నిచానెల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ సికింద్రాబాద్‌లో తన ఎక్సీ్పరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. పెట్ కేర్ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా గురువారం ఎక్సీ్పరియన్స్ సెంటర్‌లోని వెటర్నరీ కన్సల్టెంట్ డాక్టర్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. పెట్స్ 24/7 సురక్షితంగా ఉండేందుకు పెట్ కేర్ సేవలు చాలా కీలకమన్నారు. ఒకే చోట సంపూర్ణ సంరక్షణ (పోషకాహారం, వస్త్రధారణ, వైద్య మద్దతు) తాము అందిస్తామని, దీని ద్వారా పెట్ లవర్స్ ఆదరణ పొందగలమని, తమ సేవలు వారికి ఉపకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.