ప్రేమకు గుర్తుగా పుస్తకం రాసినా పట్టించుకోలేదని.. | Person Try To Commit Suicide Due To Love Failure In Suryapet | Sakshi
Sakshi News home page

ప్రేమకు గుర్తుగా పుస్తకం రాసినా పట్టించుకోలేదని..

Jan 10 2021 3:29 PM | Updated on Jan 10 2021 6:24 PM

Person Try To Commit Suicide Due To Love Failure In Suryapet - Sakshi

సాక్షి, సూర్యాపేట: ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ తర్వాత సదరు యువకుడు అపస్మారక స్థితిలో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.

వివరాలు.. సూర్యాపేటకు చెందిన ఇరుగు రామన్ హైదరాబాద్‌లో మల్టీ మీడియా రంగంలో వెబ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. మునగాల మండలానికి చెందిన అనూష అనే యువతితో పరిచయం ఏర్పడింది. 10 సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కాగా అనూష  సూర్యపేట జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుంది. అయితే ఉద్యోగం వచ్చిన తరువాత అనూష తనను పట్టించుకోవడం లేదని రామన్ మనస్తాపానికి గురయ్యాడు.

అయితే అనూషతో 10 సంవత్సరాల ప్రేమకు గుర్తుగా ఒక పుస్తకాన్ని రాసి దానిని తన మిత్రులకు పంచిపెట్టాడు. పుస్తకాలు పంచి పెట్టి, కాల్ రికార్డింగ్‌లు వెబ్ సైట్ లో పెట్టి తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని అనూష రామన్‌పై చివ్వేంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న రామన్‌ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అయితే వెంటనే  స్పందించిన పట్టణ పోలీసులు రామన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement