తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా

Patancheru MLA Mahipal Reddy Warning To Journalist - Sakshi

జర్నలిస్టుకు ఎమ్మెల్యే బెదిరింపు

పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఓ జర్నలిస్ట్‌పై దూషణలకు దిగారు. ఓ దినపత్రికలో వ చ్చిన కథనం నేపథ్యంలో సదరు జర్నలి స్ట్‌కు ఫోన్‌చేసి ‘తమాషా చేస్తున్నావా.. నా పేరుతో కథనం రాస్తావా.. ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించారు. ఈ ఆడియో కాస్తా మంగళవారం సోషల్‌ మీడియాలో వైరలైంది. అనంతరం తన ను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఫోన్‌లో దూ షించారని జర్నలిస్టు సంతోష్‌నాయక్‌ పో లీసులను ఆశ్రయించాడు. తాను రాసిన కథనానికి ఎమ్మెల్యే ఫోన్‌లో దూషించడం తో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని డీఎస్పీ భీంరెడ్డిని కలసి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే తీరును టీయూడబ్ల్యూజే– ఐజేయూ ఒక ప్రకటనలో ఖండించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top