
హైదరాబాద్ : పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2009 వరకు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. శ్రీనివాస్ మృతి పట్ల నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు