
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’, రాణీ ముఖర్జీ లీడ్ రోల్ పోషించిన ‘మర్దానీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘ఏక్ విలన్’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ వారంగ్.
హిందీ సినిమాల్లోనే కాదు... మరాఠీ చిత్రాల్లోనూ నటించారాయన. ఆశిష్ వారంగ్ మృతిపై పలువురు నటీనటులు, దర్శకులు, సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే... ఆయన మృతికి కారణం ఏంటి? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి.