వరి కొయ్యలే ఊపిరాపె | Paddy Stubble Fires Turn Deadly: Farmers Pay the Ultimate Price | Sakshi
Sakshi News home page

వరి కొయ్యలే ఊపిరాపె

Jun 8 2026 2:01 PM | Updated on Jun 9 2026 1:28 PM

Paddy Stubble Fires Turn Deadly: Farmers Pay the Ultimate Price

మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చని పొలాల్లో సిరుల రాశులను తీయాల్సిన రైతులకు వరి కొయ్యలు మృత్యుపాషాల్లా మారుతున్నాయి. అవగాహన రాహిత్యంతో కాలుస్తున్న వరి కొయ్యలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటిని కాల్చే క్రమంలో వచ్చే పొగ ఊపిరిని ఆపేస్తున్నాయి. ఎగసి పడే మంటలు రైతుల ప్రాణాలను తీస్తున్నాయి. వరి కొయ్యలను కాల్చే క్రమంలో పచ్చని చెట్లు, వ్యవసాయ సామగ్రి దగ్ధమవుతుండగా, మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. 

వారం రోజుల్లో మిరుదొడ్డి, అందె, దుబ్బాక మండలం ఎనగుర్తిలో వరి కొయ్యలను కాల్చే క్రమంలో ముగ్గురు రైతులు బలయ్యారు. సిరులు పండాల్సిన పంట పొలాల్లో రైతుల శవాల కమురు ముసురుకుంటోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వరి కొయ్యలను కాల్చడం వల్ల సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement