
ఖమ్మం అర్బన్: నిరుపేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించగా కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సార్ నగర్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి ఇళ్లు మంజూరైనట్లు జరుగుతున్న ప్రచారం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా, ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని స్థానికులు చెబు తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి నిజమైన పేదలకు ఇళ్లు మంజూరయ్యేలా చూడాలని పలువురు కోరారు.