బామ్మగారి బాపూజీ విగ్రహం | Old Woman Inauguration of Mahatma Gandhi Statue Duggondi warangal | Sakshi
Sakshi News home page

బామ్మగారి బాపూజీ విగ్రహం

Jan 27 2022 4:51 AM | Updated on Jan 27 2022 10:17 AM

Old Woman Inauguration of Mahatma Gandhi Statue Duggondi warangal - Sakshi

దుగ్గొండి: ఆమె వయసు అరవై దాటింది. పూలమ్ముకుంటేనే పట్టెడన్నం దొరుకుతుంది. ఆ బీదరాలికి జాతిపిత మహాత్మాగాంధీ అంటే అంతులేని గౌరవం.. అదే ఆమెను మహాత్ముని విగ్రహావిష్కరణకు పురిగొలిపింది. పూలమ్ముకుని సంపాదించిన సొమ్ముతో శిథిలావస్థలో ఉన్న మహాత్ముడి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లే గ్రామంలో పూలమ్ముకుని బతికే నౌగరి బుచ్చమ్మ తాత 1965లో గ్రామంలో మహా త్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.

తాత ఏర్పాటు చేసిన విగ్రహం స్థానంలో బుచ్చమ్మ పూలవ్యాపా రం చేసి వెనకేసుకున్న డబ్బు రూ.25 వేలతో మహా త్ముడి నూతన విగ్రహాన్ని తెప్పించి బుధవా రం స్వయంగా ఆవిష్కరించింది.. దీంతో గ్రామస్తులు, మండల ప్రజలు నౌగరి బుచ్చమ్మను అభినందిం చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గటిక మమత, ఉప సర్పంచ్‌ పకిడె మైనర్‌బాబు,  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement