
సాక్షి హైదరాబాద్: సంక్రాంతికి డూడూ బసవన్నలు సందడి చేస్తుంటాయి. వీటిని ఆడించే గంగిరెద్దుల వారికి జనం తమకు తోచినంత నగదు ముట్టజెబుతుంటారు. ప్రస్తుతం చిల్లర సమస్య ఉండటంతో చాలా మంది డిజిటల్ పేమెంట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బసవన్నలకు గూగూల్‌పే, ఫోన్‌పే స్కానర్లను గంగిరెద్దుల వాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం బంజారాహిల్స్‌లో ఫోన్ పే తగిలించిన డూడూ బసవన్న ఆకట్టుకుంది.
(చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!)