వచ్చే ఎన్నికల్లో ప్రధానాంశం సీపీఎస్‌ రద్దు | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో ప్రధానాంశం సీపీఎస్‌ రద్దు

Published Mon, Jan 9 2023 1:25 AM

NMOPS General Secretary Sthitaprajna About Contributory Pension Scheme CPS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు అంశమే రాబోయే సాధారణ ఎన్ని­కల్లో ప్రధానాంశం అవుతుందని నేషనల్‌ మూవ్‌­మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్‌) సెక్రెటరీ జనరల్‌ గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయిని చరక్‌ భవన్‌ గ్రౌండ్‌లో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యా­యుల కుంభమేళా నిర్వహించారు.

కార్య­క్రమంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటికే ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసిందని, మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.లక్షల కోట్ల కార్పొరేట్‌ కంపెనీల అప్పులు రద్దు చేసినప్పుడు కలగని నష్టం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పింఛన్‌ అమలు చేస్తే వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహాకాళుడి సాక్షిగా ఉజ్జయిని నగరంలో ‘ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌’ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విజయకుమార్‌ బంధు (ఉత్తరప్రదేశ్‌), వితీశ్‌ ఖండేల్కర్‌ (మహారాష్ట్ర), కల్వల్‌ శ్రీకాంత్, నరేశ్‌ గౌడ్‌ (తెలంగాణ) తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement